రోడ్డుపై ఎద్దు ఏం చేసిందంటే?..అమ్మో!
బెంగళూరులో ఒక ప్రమాదకరమైన ఘటన జరిగింది. ఆ వీడియో చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఒక ఎద్దు చేసిన పనికి ఒక వ్యక్తి ప్రాణాలు పోయేవి. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం తప్పింది. బెంగళూరులోని మహాలక్ష్మీ లేఅవుట్ ప్రాంతంలో ఇరుకైన రోడ్డులో ఒక మహిళ ఎద్దును తోలుకుంటూ వెళుతుండగా, ఉన్నట్టుండి ఎద్దు బైక్పై ఎదురుగా వస్తున్న వ్యక్తి పైకి దూకింది. ఈ దూకుడికి అతడు ఎదురుగా వస్తున్న లారీ కింద పడ్డాడు. అయితే లారీ డ్రైవర్ చాకచక్యంతో బ్రేక్ వెయ్యడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే అతడి ప్రాణం గాలిలో కలిసిపోయేది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డవడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

