Home Page SliderTelangana

అన్విత గ్రూప్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్ నగరంలో అన్విత గ్రూప్ బిల్డర్స్ కార్యాలయాలలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆదాయపు పన్ను అధికారులు పలు దస్త్రాలను పరిశీలిస్తున్నారు. ఏకకాలంలో 30 చోట్ల దాడులు జరిగాయి.  సంస్థ డైరక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాయదుర్గం, జూబ్లీహిల్స్, కొల్లూరు, సంగారెడ్డి ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లలో కూడా ఐటీ కారిడార్‌లో తనిఖీలు జరుగుతున్నాయి.