BusinessPoliticsTelanganatelangana,

ఫాక్స్‌కాన్ ఫాక్టరీకి రాష్ట్రం పూర్తి మద్దతు..సీఎం

కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్‌ఐటి)  ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సందర్శించారు.  కంపెనీకి ప్రభుత్వం తరఫున అందించాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించటంతో పాటు ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం  పూర్తి మద్దతునిస్తుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న ఫాక్స్‌కాన్  కార్యకలాపాలు. భవిష్యత్  ప్రణాళికల కు  రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో ఎఫ్‌ఐటి మరిన్ని పెట్టుబడులకు ముందుకు రావాలని  ముఖ్యమంత్రి కంపెనీ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. మ్యానుపాక్చరింగ్ రంగంలో పాటు కొత్త ఆవిష్కరణలకు  రాష్ట్రంలో  అనుకూల వాతావరణం ఉందని వివరించారు.