Home Page SliderTelangana

సచివాలయంలో బతుకమ్మ ఆడిన సీఎస్

డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాలకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ ఉత్సవాలను సచివాలయ ప్రాంగంణంలో నిర్వహించడం పట్ల సి.ఎస్ ఆనందం వ్యక్త పరిచారు. ఈ బతుకమ్మ ఉత్సవాలలో సచివాలయంలోని ఉన్నతాధికారుల నుండి అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు.  తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో సంబరాలు చేశారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ ఉత్సవాలలో సచివాలయ ఉన్నతాధికారులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.