Home Page SliderNational

జాతిపితకు ప్రముఖుల నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఢిల్లీలోని గాంధీ స్మారక చిహ్నం రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లి ఆ మహాత్మునికి అంజలి ఘటించారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ మహాత్మునికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా మహాత్ముని స్మరిస్తూ పోస్టు చేశారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్దాంతాలతో బాపూజీ జీవితాన్ని గడిపారని, ఆయన ఆదర్శాలు దేశప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని గుర్తు చేసుకున్నారు.