Home Page SliderTelangana

బాలికలు.. టాయిలెట్ గోడలయ్యారు..

మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో టాయిలెట్స్ లేక విద్యార్థినులు చుట్టూ నిలబడితే మధ్యలో ఒకరి తర్వాత ఒకరు పనిని ముగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్కూల్లో 540 మంది స్టూడెంట్స్ ఉండగా, వారిలో 232 మంది బాలికలే. గతంలో బాలురులకు ఒకటి, బాలికలకు ఒకటి చొప్పున టాయిలెట్స్ ఉండేవి. కానీ మెయింటెనెన్స్ లేక ఆ రెండూ మూలనపడ్డాయి. గత బీఆర్ఎస్ హయాంలో ‘మన ఊరు మన బడి’ కింద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. కానీ కాంట్రాక్టర్ కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో బాలురు ఆరు బయటకు వెళ్తుండగా, బాలికల పరిస్థితి దయనీయంగా మారింది.