HealthHome Page SliderNational

కేరళలో నిఫా వైరస్ అలర్ట్..

కేరళలో నిఫావైరస్ కారణంగా సెప్టెంబర్ 9న ఒక వ్యక్తి మరణించడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే మంకీవైరస్ కేసులు బెంబేలెత్తించడంతో కంటైన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటు చేసి, జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కేరళలోని మలప్పురంలో 250 మందిని ఐసోలేషన్‌లో ఉంచారు. కేరళలోని కేసులతో తమిళనాడు కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.  కేరళ నుండి కన్యాకుమారి ద్వారా తమిళనాడుకు వచ్చే వాహనాలను ఆపి, వైరస్ లక్షణాలను పరిశీలిస్తున్నారు. వైరస్ లక్షణాలు ఉన్నవారిని గుర్తించడానికి పరీక్షలు చేస్తున్నారు. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు ఢిల్లీలో నమోదు కాగా, హర్యానాలో కూడా 26 ఏళ్ల వ్యక్తికి వెస్ట్ ఆఫ్రికన్ మంకీపాక్స్ వచ్చినట్లు గుర్తించారు. నాగర్ కోయిల్‌లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు.