ఈ అలవాట్లతో అందం పాడైపోతుందా?
ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఈ బిజీ లైఫ్ లో సరైన సమయం కుదరక ఏది పడితే అది తినేసి అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తున్నాం. మీకున్న సమయంలోనే కొద్దిగా మార్పులు చేసుకుని టైం సెట్ చేసుకుంటే ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంపొందించుకోవచ్చు. అయితే.. ఈ అలవాట్లను మీరు మానకపోతే మీ అందాన్ని పాడు చేస్తుంది. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రతి రోజు ఉదయం టీ, కాఫీ త్రాగే అలవాటు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది.
సన్ స్కీన్ లోషన్ ను అప్లై చేయకపోవడం వల్ల.. హానికరమైన కిరణాల వల్ల చర్మం దెబ్బ తింటుంది.
చర్మం, జుట్టు కోసం ఒకే ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉపయోగించడం.
ఉదయం రెండు గ్లాసుల నీరు త్రాగక పోవడం వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది.
మురికి మేకప్ బ్రష్ లు ఉపయోగించడం చర్మం ఇన్ఫెక్షన్ కారణమవుతుంది.
కఠినమైన సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. చర్మానికి సరిపోయే ఫేస్ వాష్ ని ఎంచుకోవాలి.
ఉదయం నూనెతో కూడిన అల్పహారం తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమవుతుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసమే.. సమస్య ఏదైనా ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.

