Home Page SliderNational

ఇద్దరు హీరోయిన్లతో ప్రభాస్ కొత్త చిత్రం

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రంపై కొత్త అప్‌డేట్ వచ్చింది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్  ఇమాన్వి ఇప్పటికే ఒక హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. మరో హీరోయిన్‌ను త్వరలోనే ప్రకటిస్తారని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తవుతోంది. మధురైలో ఏర్పాటు చేసిన సెట్‌లో ప్రభాస్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కల్కి 2898 AD చిత్రం తర్వాత ప్రభాస్ రాజాసాబ్ షూటింగులో పాల్గొంటున్నారు. అనంతరం ఫౌజీ చిత్ర షూటింగులో పాల్గొంటారని సమాచారం.