ఎల్‌ఐసీకి ఇన్ఫోసిస్ ఏఐ సహకారం
ప్రభుత్వ జీవిత భీమా సంస్థ ఎల్‌ఐసీకి, ఇన్ఫోసిస్ కంపెనీ ఏఐ సహకారం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్‌లోని డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌హాన్స్‌మెంట్ సహాయంతో త్వరలోనే ఎల్‌ఐసీలో ఏఐ ఆధారిత సేవలు మొదలవుతాయని సంస్థ వెల్లడించింది. కస్టమర్లు, ఏజెంట్లు, ఉద్యోగులకు ఓమ్ని చానెల్ ఎంగేజ్‌మెంట్, డేటా ఆధారిత హైపర్ పర్సనలైజ్డ్ అనుభవాలను అందిస్తుంది. ఏఐ క్లౌడ్ నైపుణ్యాలను ఎల్‌ఐసీలో ప్రవేశపెట్టనున్నామని ఇన్ఫోసిస్ సీఈఓ వెల్లడించారు. ఇన్ఫోసిస్ సహకారంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరివర్తన మెరుగుపడుతుందని, కస్టమర్లు లేటెస్ట్ టెక్నాలజీ అనుభవాలను పొందవచ్చని ఎల్‌ఐసీ సీఈవో సిద్దార్థ్ మొహంతి పేర్కొన్నారు.