ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం..లారీ పల్టీ
హైదరాబాద్ శివార్లలోని పెద అంబర్‌పేట సమీపంలో తారామతి పేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అక్కడి ఓఆర్‌ఆర్ పైనుండి ఐరన్ లోడ్‌తో ఉన్న లారీ పల్టీ కొడుతూ కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై పడిపోయింది. ఈ లారీ ఘట్ కేసర్ నుండి బెంగళూరు వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. క్లీనర్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

