రోజా చిప్ప కూడు తిన్నాల్సిందే: ఎమ్మెల్యే
ఓ వైపు వరద ప్రాంతాల్లో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు అందిస్తుంటే మరోవైపు రోజా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్. వరదలపై మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై ఎమ్యెల్యే సీరియస్ అయ్యారు. వరదలపై ఏం మాట్లాడుతుందో రోజాకే అర్థం కావట్లేదన్నారు. ఆపదకాలంలో ఉన్న ప్రజలకు సహాయం చేయకుండా రోజా దూరంగా ఉండి విమర్శ చేయడం శోచనీయమన్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో కోట్ల రూపాయలు తినేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. దోచుకోవడానికి ‘ఆడుదం ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రోజా చేసిన ల్యాండ్ కబ్జాలు, స్కాములు త్వరలో బయటపడతాయని చెప్పారు. తప్పు చేసిన ఎవరైనా సరే చిప్ప కూడు తినాల్సిందేనని గాలి భాను ప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

