Home Page SliderNational

ప్రభాస్ దారిలోనే పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ, తెలంగాణాలకు భారీ సాయం ప్రకటించారు. హీరో ప్రభాస్‌తో సమానంగా ఏపీకి రూ.కోటి, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఏపీకి తొలుత విరాళాన్ని ప్రకటించిన పవన్ కాసేపటి తర్వాత తెలంగాణాకు కూడా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు కలచివేశాయని, త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా వైసీపీ నేతలు పవన్‌పై వరద ప్రాంతాలలో పర్యటించలేదంటూ ఆరోపణలు చేశారు. దీనితో తాను వరద ప్రాంతాలలో పర్యటిస్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని, ప్రజలు తనను కలుసుకోవడానికి, చూడడానికి వస్తారంటూ వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్. వరదలపై అన్ని నియోజక వర్గాలపై సమీక్షలు నిర్వహిస్తూ, వారికి తగిన విధంగా సహాయక చర్యలు అందేలా పవన్ కళ్యాణ్ చూస్తున్నట్లు ఆయన టీమ్ తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు అన్నింటికన్నా సహాయం చేయడం ముఖ్యమని పవన్ భావిస్తున్నట్లు తెలిపారు.