కూల్చివేతల నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌కు…
హైదరాబాద్‌లోని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేసింది. మధురానగర్‌లోని ఆయన ఇంటి వద్ద ఔట్ పోస్టు ఏర్పాటు చేసింది. రంగనాథ్ ప్రముఖుల ఇళ్లు, అక్రమ కట్టడాల కూల్చివేతలలో దూకుడుగా వ్యవహరించడంతో అతనికి ప్రమాదం ఉందని భావించింది ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి కట్టిన కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెషన్‌ను కూడా కూలగొట్టిన సంగతి తెలిసిందే. అలాగే అనేక మంది రాజకీయనాయకులు, ప్రముఖులకు చెందిన కట్టడాల విషయంలో కూడా నోటీసులు ఇచ్చారు. దీనితో సీపీ రంగనాథ్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి అతని భద్రతను పెంచారు.

