చంద్రబాబుకు ఇలాంటి హెలికాఫ్టరా?
ఇటీవల మహారాష్ట్రలోని పూణె వద్ద హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా నలుగురు గాయపడ్డారు. అయితే ఈ హెలికాఫ్టర్ చంద్రబాబు కోసం కేటాయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుకు ఇలాంటి హెలికాఫ్టర్ కేటాయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది 16 ఏళ్ల నాటి హెలికాఫ్టర్ అని, నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటివి కొనసాగించకూడదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం భద్రతపై అనుమానాలు, ఆందోళనలు రేకెత్తుతున్నాయి. ఏవియేషన్ అధికారులకు దాని సామర్థ్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు.