సైజ్ జీరోలో సామ్ అసలు మ్యాటరేంటంటే…!?
అభిమానుల కోసం మన సామ్ ఎప్పుడూ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే మిగిలిన వాళ్లందరూ ఏవేవో ట్రిక్కులు, మ్యాజిక్ లు చేయాలి కాని సమంత జస్ట్ ఒక పోస్ట్ షేర్ చేస్తే చాలు యూత్ మొత్తం లైక్స్ తో కామెంట్స్ తో అభిమానం చూపిస్తారు. మొన్నాఈ మధ్య సామ్ ఆరోగ్యం విషయంలో కూడా ఫాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు సామ్ పెట్టిన ప్రతి పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమాన నటి ఆరోగ్యాయం గురించి ఆరాలు తీస్తున్నారు. ప్రసుత్తం ఆమె షేర్ చేసిన ఫొటోల చుట్టూ, ఇంట్రస్టింగ్ కామెంట్లు విన్పిస్తున్నాయి. ఇంత సన్నగా ఎందుకు మారారు? హెల్త్ బాగానే ఉంది కదా అంటూ అభిమానులు కామెంట్ల వర్షంతో ప్రేమ చూపుతున్నారు. ఇటీవల సామ్ తెలుగు సినిమాకు కొంచెం దూరంగానే ఉందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలం బాలీవుడ్లో ఎక్కువగా కనిపిస్తుంది సామ్, ఆమె ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లో చేస్తున్న మూవీతో పాటు మరి కొన్ని కొత్త ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ యాక్టర్స్‌తో పోటీకి రావాలంటే ఆ మాత్రం మెయింటేన్ చెయ్యాల్సిందేనంటున్నారు నెటిజన్లు.