పిడుగుల నియంత్రణకు ఈ చెట్లు పెంచండి-ఒరిస్సా
ఒరిస్సాలో పిడుగులను నియంత్రించడానికి సరికొత్త మార్గం అవలంభిస్తోంది ప్రభుత్వం. పిడుగుల నియంత్రణకు తాటిచెట్లను పెంచాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. దశలవారీగా ఈ చెట్ల పెంపకాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా అడవుల సరిహద్దుల్లో 19 లక్షల మొక్కలను నాటనున్నారు. ఎత్తు ఎక్కువగా ఉండే తాటిచెట్లకు పిడుగులను గ్రహించే లక్షణాలున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఒడిశాలో పిడుగుపాటు కారణంగా గత 11 ఏళ్లలో 3,800 మంది చనిపోయారని లెక్కలు చెప్తున్నాయి.

