Home Page SliderNational

నా కెరియర్‌లోనే ది బెస్ట్ రోల్ – విక్ర‌మ్

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ నటిస్తున్న మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. “తంగలాన్” ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చియాన్ విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఇంతకీ, విక్రమ్ ఏం మాట్లాడారంటే.. ‘మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు నాకు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఎప్పటికీ కావాలి. తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. తంగలాన్ ఒక మంచి సినిమా. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్‌ప్రైజ్‌గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా’ అని విక్రమ్ చెప్పుకొచ్చారు. తెలుగులో ఈ చిత్రాన్ని ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్’ ద్వారా రిలీజ్ చేస్తోంది.