నీట్‌పై సుప్రీం కీలక సూచనలు
నీట్ యూజీ పేపర్ లీకేజి వ్యవహారంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ పేపర్ లీకేజిలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదంటూ వ్యాఖ్యానించింది. ఈ పేపర్ లీకేజి కేవలం హజారీబాగ్, పాట్నాకి మాత్రమే పరిమితమయ్యిందని తెలిపింది. అయితే లోపాల సవరణకు కీలక సూచనలు నిర్థేశించింది. కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలలో నివేదిక ఇవ్వాలని, దీని అమలుపై రెండు వారాలలో సుప్రీంకోర్టుకు కేంద్రవిద్యాశాఖ రిపోర్టు ఇవ్వాలని పేర్కొంది.
సుప్రీంకోర్టు సూచనలలో ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి.
ఎవల్యూషన్‌కు కమిటీ ఏర్పాటు చేయాలి.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి.
పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి.
గుర్తింపు తనిఖీ ప్రక్రియను మెరుగుపరచాలి.
పరీక్షా కేంద్రాలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.
సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి.

