ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద..
సౌతిండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష. తాజాగా త్రిష నటించిన వెబ్ సిరీస్ బృంద ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రైం థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల రైటర్ కమ్ డైరెక్టర్. ఈ బ్యూటీ గ్లామరస్ రోల్స్‌తోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలతో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఈ తెలుగు వెబ్ ప్రాజెక్ట్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీలివ్‌లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా అందుబాటులో ఉంది బృంద. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేసింది త్రిష. ఈ ప్రాజెక్ట్‌లో త్రిష సస్పెండ్ అయిన పోలీసాఫీసర్‌గా నటించింది. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్‌సామి, రాకేందు మౌళి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు.
యాడింగ్ అడ్వర్‌టైజింగ్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కొల్ల అశిష్ నిర్మించిన బృందకు శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ కంపోజర్‌గా వ్యవహరించారు. త్రిష ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తోన్న విశ్వంభరలో ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోందని తెలిసిందే. దీంతోపాటు పలు సినిమాలకు కూడా సంతకాలు చేసి యాక్టింగ్‌కు సిద్ధంగా ఉన్న త్రిష.

