అటవీశాఖ ఉన్నతాధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో పవన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వన్య ప్రాణులను వేటాడి అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇటీవల పల్నాడు జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి ఘటనపై పవన్ అధికారులను ఆరా తీశారు.