స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270/- పెరిగి రూ.69,000/-లకు చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250/- పెరిగి రూ.63,250/-గా ఉంది. అయితే వెండి ధరలు మాత్రం ఇవాళ పెరగలేదు. దీంతో కేజీ వెండి ధర రూ.84,500గా ఉంది. గతకొన్ని రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గడంతో కొనిగోలుదారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి కనబరిచారు. అయితే ఈ రోజు మళ్లీ బంగారం ధరలు స్వల్పంగా పెరగడంతో అమ్మకాలు కాస్త తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.


 
							 
							