‘బడ్డీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ షోకి చీఫ్ గెస్ట్‌గా కార్తి!
టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో చిత్రం తరువాత బడ్డీ సినిమా ఒకటే ప్రకటించాడు. శాన్ అంటోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆగస్ట్ 2, 2024 న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ ఇప్పటికే వేగవంతం అయింది. అందులో భాగంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. జూలై 27వ తేదీన హైదరాబాద్‌లో ట్రిడెంట్ హోటల్‌లో నిర్వహించనున్నారు మేకర్స్. ఈవెంట్‌కి స్టార్ యాక్టర్ కార్తీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించిన బడ్డీ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముఖేష్ రిషి, మహమ్మద్ అలీ, ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. హిప్‌హాప్ తమిళ చిత్రంకి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

