Home Page SliderTelangana

అత్తగారి పేరు కలిసేలా పాప పేరు పెట్టాం..మంచు మనోజ్

మంచు మనోజ్ దంపతులకు ఆడపిల్ల పుట్టిన సంగతి తెలిసిందే. వారి బుజ్జాయికి నేడు నామకరణం చేశారు. పాప పేరులో మనోజ్ అత్తగారు దివంగత నేత శోభానాగిరెడ్డి పేరు కలిసి వచ్చేలా శోభ కలిపి పెట్టినట్లు తెలిపారు. శివుడి దయతో, మా పాపకు పేరు పెట్టాం. శివుని భక్తునిగా, సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు కలిసి వచ్చేలా దేవసేన శోభ అని పేరుపెట్టాం అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు మనోజ్. తన సోదరి మంచు లక్ష్మి మొదటి నుండి తనకు సపోర్టుగా నిలిచిందని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇరు కుటుంబాల అంగీకారంతో గత సంవత్సరం మనోజ్, మౌనికారెడ్డిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండవ వివాహం కాగా, మౌనికకు గతంలోనే బాబు కూడా ఉన్నాడు.