వరంగల్ నేతకే టీడీపీ అధ్యక్ష పదవి?
టిజి: రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడి ప్రకటన మళ్లీ వాయిదా పడింది. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పగ్గాలను యువనేతకే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. వరంగల్‌కు చెందిన టీడీపీ నాయకుడు, వ్యాపారవేత్తకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఆయన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు దగ్గర అని, ఆయన అనుచరుడు అని సమాచారం. మరోవైపు సీనియర్ నేతలు, మహిళలు సైతం అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు.

