ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష
నీట్ పీజీ 2024 పరీక్షను ఆగస్టు 11న నిర్వహించనున్నట్లు NBEMS ప్రకటించింది. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుందని, పూర్తి వివరాలకు https://natboard.edu.in/ వెబ్సైట్ను సందర్శించాలని తెలిపింది. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా వివాదం నెలకొనడంతో గత నెల 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసిన సంగతి తెలిసిందే.