‘బడా పారిశ్రామిక వేత్తల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోంది’-రాహుల్
మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తల కోసమే పనిచేస్తోందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్సభలో ప్రభుత్వ విపక్షాల మధ్య వాడి వేడి చర్చ కొనసాగుతోంది. రైతులను భయపెడుతోందన్నారు. జీఎస్టీ,ఐటీ సంస్థలు కేవలం చిన్న, మధ్యతరహా వ్యాపారులనే వేధింపులకు గురిచేస్తున్నారు. బడా పారిశ్రామిక వేత్తలు తప్పించుకుంటున్నారన్నారు. చిన్న పరిశ్రమలను నాశనం చేశారు. నోట్లరద్దు కూడా పథకం ప్రకారమే చేసారన్నారు. రైతులను తీవ్రవాదులుగా లెక్కవేస్తున్నారు. మణిపూర్లో అంతర్యుద్ధం జరుగుతుంటే ఇన్నాళ్లు ప్రధాని మణిపూర్ని ఎందుకు సందర్శించలేదన్నారు. మణిపూర్ని భారత్లో అంతర్భాగంగా మోదీ భావించట్లేదన్నారు రాహుల్. ఉద్యోగాలు లేక యువత అల్లల్లాడుతోందన్నారు. వేల కోట్ల రూపాయలు ఎగవేతదారులకు మాఫీ చేస్తున్నారు. రైతు రుణమాఫీలు ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. పేదవారి భూములు ఆక్రమించి అయోధ్య రామాలయం నిర్మించారని మండిపడ్డారు. రాసిపెట్టుకోండి.. రాబోయే ఎన్నికలలో గుజరాత్లో బీజేపీని ఓడించి తీరుతామన్నారు.

