Andhra PradeshHome Page Slider

ఏపీకి రానున్న తుఫాన్ ముప్పు

ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. ఇది క్రమంగా అల్పపీడనంగా మారి 72 గంటల్లో ఏపీ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.