Home Page SliderTelangana

సింగరేణిని దివాలా తీయించింది కేసీఆరే..బండిసంజయ్

కేంద్రమంత్రి బండిసంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణిని దివాలా తీయించింది కేసీఆరేనని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సింగరేణిపై సీబీఐ విచారణను కోరే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం అని, రాష్ట్రం వాటా 51 శాతం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సింగరేణిపై ప్రేమ ఉంటే, కార్మికులపై బాధ్యత ఉంటే అక్రమాలపై సీబీఐ విచారణకు కట్టుబడి ఉన్నారా అంటూ సవాల్ చేశారు. కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.