బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్: బీఆర్ఎస్‌కు చెందిన పటాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది. అతడి సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి పటాన్‌చెరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. గతంలో లగ్డారం గనుల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ కేసు నేపథ్యంలోనే ఈడీ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం.

