ఏపీ టీడీపీ చీఫ్గా పల్లా శ్రీనివాసరావు?
ఏపీ టీడీపీ చీఫ్ గా పల్లా శ్రీనివాసరావుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఆయన గత ఎన్నికల్లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు. ఆయనకు చంద్రబాబు కేబినెట్ లో చోటు లభించగా, యాదవ సామాజికవర్గానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు పార్టీ అధ్యక్ష బాధ్యతలివ్వడం ద్వారా, ఆ సామాజికవర్గాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు, మంత్రి గుడివాడ అమర్నాథ్ పై భారీ విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పల్లా విజయం సాధించారు. అమర్నాథ్ పై 95 వేల 235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు పల్లా శ్రీనివాసరావు