Andhra PradeshHome Page Slider

ఏపీలో వైసీపీని అంతం చేయాలని చూస్తున్నారు: కొడాలి నాని

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి కూటమి కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడటం రాష్ట్రంలో  తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా దీనిపై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీలో కూటమి నేతలు ఉద్దేశపూర్వకంగా  వైసీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో వైసీపీని అంతం చేయాలని కూటమి నేతలు చూస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని కొడాలి నాని మండిపడ్డారు. అయితే ఏపీ పోలీసులు కూడా వారిని నిలువరించకుండా చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు.దీనిపై పోలీసులకు సమాచారం అందించినా స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలో  వైసీపీ నేతలపై కూటమి నేతలు,కార్యకర్తలు చేస్తున్న దాడులపై పోరాడుతామని కొడాలి నాని పేర్కొన్నారు.