మల్కాజ్‌గిరిలో ఈటల రాజేందర్ ఘన విజయం
దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజక వర్గం మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై దాదాపు మూడున్నర లక్షల పై చిలుకు ఓట్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేశారు. మరోపక్క బీజేపీ పార్టీ కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సహా 8 లోక్‌సభ స్థానాలలో పార్టీ ఆధిక్యతలో ఉంది.

