Andhra PradeshHome Page Slider

ఏపీలో జనసేన ప్రభంజనం.. పోటీ చేసిన 21 స్థానాలలోనూ ఆధిక్యం

జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో ప్రభంజనం సృష్టిస్తోంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలోనూ జనసేన ఆధిక్యతలో వచ్చింది. మొదటినుండీ 20 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా పాలకొండలో వెనుకబడింది. కానీ ప్రస్తుతం అక్కడ కూడా జనసేన అభ్యర్థి ఆధిక్యతలోకి రావడంతో 21 స్థానాలలోనూ జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలలో కూడా ఆధిక్యతలో ఉండడం విశేషం. కాకినాడలో, మచలీపట్నంలో జనసేన పార్లమెంటుకు పోటీ చేస్తోంది.  గత ఎన్నికలలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.