Andhra PradeshHome Page Slider

ముందెన్నడూ లేని విధంగా సంక్షేమం, పేదరికం లేని రాష్ట్రమే లక్ష్యమన్న చంద్రబాబు

టీడీపీ వస్తే తప్ప ఉద్యోగాలు రావని అందరికీ అర్థమయ్యిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌ను ఓడించడానికి సిద్ధమా అన్నారు. సీఎం జగన్ రివర్స్ పాలనలో ప్రజల జీవితాలు రివర్స్ అయ్యాయన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నెలకు 3 వేలిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తామన్నారు. ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తానన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు దొరక్క హైదరాబాద్ కు వలస వెళ్లాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో పేదలు లేకుండా చూడటమే నా ఆశయమన్నారు. బూతులు మాట్లాడే వాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు.

అమరావతి రాజధానిగా ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ వచ్చేదన్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేరు కానీ 3 రాజధానులు కడతారన్నారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాలిచ్చారన్నారు. అమరావతి పూర్తై ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం వచ్చేదన్నారు. వర్ల కుటుంబం పార్టీ కోసం కష్టపడిన కుటుంబమన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కృష్ణా జిల్లా పాముర్రులో టీడీపీ ప్రజాగళం సభలో పాల్గొన్నారు.