Home Page SliderNational

విశాఖ టెస్టులో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదు చేసుకొంది. హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఓడిన ఇండియా విశాఖలో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌ల మూడు వికెట్ల తీశారు. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ను 106 పరుగుల తేడాతో ఓడించడంలో భారత్‌ సీరిస్ ను 1-1 సమం చేసింది. క్రీజులో జాక్ క్రాలే, రెహాన్ అహ్మద్ నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లండ్ 4వ రోజు 332 పరుగులు చేయాల్సి ఉంది. అయితే, అశ్విన్ స్పెల్ ఆతిథ్య జట్టును ఇరకాటంలోకి నెట్టింది. క్రాలే 73 పరుగుల వద్ద నిష్క్రమించాడు. ఇతర ఇంగ్లీష్ బ్యాటర్ 40 పరుగుల మార్కును దాటలేకపోయారు. బుమ్రా, అశ్విన్ ఇద్దరూ మూడు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 292 పరుగులకు ఆలౌటైంది.