హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి
తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టు మెట్లెక్కారు.కాగా ఇటీవల ఆయనపై శామీర్పేట్లో భూకబ్జా కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని ఆయన ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా రాజకీయ కక్ష్య సాధింపులో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారని మల్లారెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి పిటిషన్పై శుక్రవారం తెలంగాణా హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా శామీర్పేట్లో 47 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 9 మందిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు.