నాని నెక్ట్స్ సినిమా ఆ డైరెక్టర్తోనేనా..?
నేచురల్ స్టార్ నాని తాజాగా “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాగా ఈ సినిమాలో నానికి జోడీగా సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించి మెప్పించారు. అయితే నాని తన నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారని అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నాని తన నెక్ట్స్ సినిమా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో చేయనున్నారని వార్తలు ఊపందుకున్నాయి. ఇప్పటికే హీరో నానికి దాదాపు 6గురు తమిళ డైరెక్టర్లు కథ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా నాని వారిలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సివుంది. ప్రస్తుతం నాని “హాయ్ నాన్న” తండ్రి,కూతుర్ల ఎమోషనల్ కథ ప్రేక్షకులను థియోటర్లలలో అలరిస్తోంది. మరోవైపు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన “జిగర్తాండ-డబుల్ X” ఇటీవల విడుదలైంది.