Home Page SliderTelangana

బీజేపీ వల్లే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందింది: జేపీ నడ్డా

బోధన్: ప్రధాని మోడీ వల్లే ఇవాళ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో నడ్డా మాట్లాడారు. రైతులు, పేదలు, మహిళా విరోధి కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా పేదలు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చాయా? తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయా? అని నడ్డా ప్రశ్నించారు.