Home Page SliderTelangana

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న మార్తినేని ధర్మారావు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీసీ నేత ముఖ్యమంత్రి పదవి చేపడతారని బీజేపీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు అన్నారు. మంగళవారం బీజేపీ రీజినల్ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. సామాన్య కార్యకర్త దగ్గర నుండి కేంద్ర మంత్రి పదవి వరకు ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే తిరిగి బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతారన్నారు. ప్రధాని మోడీ విశ్వసనీయతకు మారుపేరన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ అభివృద్ధికి కృషి చేయడం ఖాయమన్నారు.