భువనగిరిలో బీజేపీ-కాషాయం ఖాయం
భువనగిరి: భువనగిరి బీజేపీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ పర్వం శుక్రవారం ఉత్సాహభరితంగా సాగింది. స్థానిక రైల్వే స్టేషన్ దగ్గరలోని సాయిబాబా మందిరం నుండి ప్రదర్శన మొదలైంది. పాత బస్టాండ్, కొత్త బస్ స్టేషన్, ప్రిన్స్ చౌరస్తా మీదుగా సాగింది. కేంద్ర క్రీడల శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్, అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పట్టణాధ్యక్షుడు పాదరాజు ఉమాశంకర్‌రావు తదితరులు ప్రచార రథంపై నిల్చుని ప్రజలకు నమస్కరిస్తూ ముందుకు సాగారు.


 
							 
							