Home Page SliderTelangana

ఎవరి గోల వారిది.. ఎవరి దారి వారిది: కిషన్ రెడ్డి

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు.

హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఈ విషయంలో ఎవరి ఇష్టం ఎవరి గోల వారిదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీ పోటీ కాకుండా పోదని వ్యాఖ్యానించారు.

బీజేపీపై నిందలు వేయడం సరికాదు: లక్ష్మణ్ – బీజేపీ ఎంపీ, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ రాజగోపాల్‌ రెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రక్తం చిందిస్తున్నారని.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. జాతీయ నాయకత్వం ఆధ్వర్యంలో బీజేపీలో చేరి ఇప్పుడు నిందలు వేయడం బాగోలేదన్నారు. కచ్చితంగా మూడోసారి మోదీ ప్రధాని అవ్వడం ఖాయం. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు ఇదంతా ఓ కంట కనిపెడుతున్నారు గమనించండి. జనసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. జాతీయ భావాన్ని బీజేపీ పెంపొందింస్తోందని లక్ష్మణ్ అన్నారు.

రాజగోపాల్ రెడ్డి పాసింగ్ క్లౌడ్: రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఆయన్ను పాసింగ్ క్లౌడ్‌గా కొనియాడారు. పార్టీ ఎప్పుడూ బలంగా ఉంటుందని.. కొందరు అలా వచ్చి ఇలా వెళ్లిపోతారన్నారు. తాను ఎంపీగానే పోటీ చేయాలనుకుంటున్నట్లు జితేందర్ రెడ్డి అన్నారు.