ఇజ్రాయెల్-హమాస్‌ల యుద్ధంలో అమెరికా రంగప్రవేశం..
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో రంగప్రవేశం చేసింది. ఇప్పటికే అమెరికా యుద్ధనౌకను పంపించిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు రక్షణగా ఎర్రసముద్రంలో ప్రవేశించిన ఈ యుద్ధ నౌక హుతి మిలిటెంట్లు ప్రయోగించిన కొన్ని క్షిపణులను కూల్చివేసింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్‌కు మద్దతుగా రెండు విమాన వాహక నౌకలను కూడా అమెరికా మొహరించింది. ఇరాన్ మద్దతు ఉన్న హుతి మిలిటెంట్లు ఇజ్రాయెల్ దిశగా క్షిపణులను, పలు డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఈ యూఎస్ కార్ని గురువారం నాడు సూయజ్ కాలువ మీదుగా ఎర్రసముద్రంలో ప్రవేశించింది. ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కూడా సౌదీ, యూఏఈ, కతర్కు చెందిన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.