అక్టోబర్ 4 వరకు లోకేష్‌ను అరెస్టు చేయొద్దన్న ఏపీ హైకోర్టు
టీడీపీ యువనేత నారా లోకేష్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలెప్మెంట్, ఫైబర్ నెట్ కేసుల్లో అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడిని ఆదేశించింది. తక్షణం ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్న లోకేష్ కోర్టును ఆశ్రయించారు. లోకేష్ తరపున న్యాయవాదులు కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారించిన ధర్మాసనం, విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. స్కిల్ డవలెప్మెంట్ కేసులో అక్టోబర్ 4 వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

