Andhra PradeshHome Page Slider

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై విచారణ, రాజకీయం కాదు: ఆరోపణలపై సజ్జల

ఎలాంటి దురుద్దేశాలు లేకుండా పాదర్శకంగా జరిగిన దర్యాప్తులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఏపీ ప్రతిపక్ష చంద్రబాబు అరెస్ట్ అయ్యాక.. రాజకీయ దురుద్దేశాలతోనే తనను అరెస్ట్ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలపై సజ్జల స్పందించారు. ఎఫ్ఎస్ఐఆర్ ఆయన పేరు లేదని.. నోటీసుల్లో కూడా ఆయన పేరు లేదని టీడీపీ లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అన్నీ తెలిసే రెండు మూడు రోజుల నుంచి తన అరెస్ట్ గురించి ఆయన మాట్లడుతున్నారని విమర్శించారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో తన పేరు లేదంటూ దబాయిస్తున్నారు. రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ, ఈ కేసు చాలా బలంగా ఉంది. ఇది రాత్రికి రాత్రి జరిగింది కాదు. దాదాపు రెండేళ్ల కిందటే ఎఫ్.ఐ.ఆర్ నమోదు అయ్యిందన్నారు.