Home Page SliderNational

సోషల్ మీడియాలోని వీడియో కారణంగా హరియాణాలోఉద్రిక్తత..కర్ఫ్యూ

హరియాణాలోని నూహ్ జిల్లా రెండు వర్గాల మధ్య సంఘర్షణలతో అట్టుడికి పోతోంది. దీనికి సోషల్ మీడియోలో పోస్ట్ చేసిన ఒక వీడియో కారణమని తెలుస్తోంది. సోమవారం నాడు ఇద్దరు హోం గార్డులు కాల్పులలో మృతి చెందారు. రాత్రి మరో వ్యక్తి మరణించారు. ఇప్పటి వరకూ నలుగురు మరణించగా, 45 మందికి గాయాలయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా అక్కడ కర్ఫ్యూ విధించారు. పోలీసులు 20 కేసులు నమోదు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. బాధ్యుల్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. నూహ్ జిల్లాకు దగ్గరలో ఉన్న గురుగ్రామ్‌లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో అక్కడ కూడా కర్ఫ్యూ విధించారు.

వదంతులు కూడా వ్యాప్తి చెందడంతో రేపు అర్థరాత్రి(బుధవారం) వరకూ ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రస్తుత ఈ ఘర్షణలకు కారణం కనిపెడతామని, బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. ప్రజలు ఉద్రేకానికి లోను కావద్దని, సంయమనం పాటించాలని కోరుతున్నారు.