ఏపీలో రేపు విద్యాసంస్థలు బంద్
ఏపీలో రేపు విద్యాసంస్థలన్నీ మూతపడనున్నాయి. కాగా విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వ తీరుకు నిరసనగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య,AISF రేపు విద్యాసంస్థల బంద్ చేపడుతున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు రేపు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌కు సహకరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యాదీవెన,వసతి దీవెన డబ్బులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఏపీలో ఖాళీగా ఉన్న 53 వేల టీచర్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.