Home Page SliderNational

అట్టుడుకుతున్న మణిపూర్…ఇతర రాష్ట్ర పోలీస్ బలగాలు తరలింపు

ఈశాన్యరాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య సంఘర్షణలతో అట్టుడికిపోతోంది. అక్కడి హింసాత్మక సంఘటనలు, అత్యాచారాలు, అరాచకాలకు అంతులేకుండా పోతోంది. దీనితో ఇతర రాష్ట్రాల పోలీస్ బలగాలను కూడా మణిపూర్‌కు తరలిస్తున్నారు. అక్కడ హింసను అరికట్టడానికి రాష్ట్ర పోలీసు, సీఆర్‌పీఎఫ్ దళాలు సరిపోవడం లేదు. దీనితో అస్సాం, నాగాలాండ్ నుండి కూడా డీఐజీ స్థాయి అధికారులను కూడా ఇద్దరిని మణిపూర్‌కు పంపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ పోలీసులకు సవాలుగా మారింది. ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి,  వారిని సామూహిక మానభంగానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన మే 4న జరిగితే జూన్ 19న సోషల్ మీడియాలలో వైరల్ అయ్యింది.  దీనితో ప్రధాని, సుప్రీంకోర్టు, సహా పలువురు నిందితులను వదిలిపెట్టేది లేదంటూ ప్రకటనలు ఇచ్చారు. ఈ ఘటనలో ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేశారు.