పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్.. ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
తిరుపతి రైల్వేస్టేషన్‌లోని 6 వ ప్లాట్‌ఫామ్‌పై పద్మావతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగానే బోగీ పట్టాలు తప్పడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు సత్వర చర్యలు చేపట్టారు. దీనితో తిరుపతి నుండి 4.55కి బయలుదేరవలసిన ఈ రైలు 7.45గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. దీని కారణంగా తిరుపతి నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ కూడా రీషెడ్యూల్ చేయబడింది. సాయంత్రం 5.30 కి బయలుదేరవలసిన ఈ రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు.

