పవన్ కళ్యాణ్‌కు వార్నింగ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారాహి యాత్రలో ఆయన అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో అధికార పార్టీ మంత్రులు,నేతలు పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ విధంగా అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య నెలకొన్న మాటల యుద్దం కారణంగా ఏపీ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్నాయి. అయితే తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీలో నిరసన చేపడుతున్న జనసేన నాయకుడిపై CI అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ CI అంజూ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్‌కు పులువురు యాదవ సంఘం నేతలు వార్నింగ్ ఇచ్చారు. ఓ బీసీ మహిళ ఎంతో కష్టపడి చదివి..CI స్థాయిలో ఉంది. ఆమె ఏ తప్పు చేయలేదు. రోడ్డు మీద ఎవరైనా ధర్నా చేస్తే..పోలీస్ వృత్తి ప్రకారం అలా అడిగారన్నారు. అయితే CI అంజూ యాదవ్ బీసీ మహిళ కాబట్టే ఇలా మాట్లాడుతున్నారా అన్నారు. గత ప్రభుత్వంలో వనజాక్షిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే.. మీరేం చేశారని యాదవ్ సంఘం నేతలు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నించారు.

